కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

Six Killed in Lorry hits Auto at Kamareddy. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ఆటో ఢీకొట్టుకున్న సంఘటనలో

By Medi Samrat
Published on : 18 July 2022 5:39 PM IST

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ఆటో ఢీకొట్టుకున్న సంఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన 161వ జాతీయ రహదారి మద్నూరు మండలం మెనూరు వద్ద సోమవారం చోటు చేసుకుంది. మద్నూరు నుంచి బిచ్కుంద వైపు ఆటో జాతీయ రహదారిపై రాంగ్‌రూట్‌లో వెళుతుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి గుజరాత్‌ వైపు కంటైనర్‌ లారీ వెళ్తున్నది. రెండు వాహనాలు వేగంగా ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది.

లారీ ముందు భాగంలోకి ఆటో చొచ్చుకువెళ్లింది. ఆరుగురి మృతదేహాలు మాత్రం బయటకు కనిపిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆటోను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆటో రాంగ్‌రూట్‌లో వేగంగా రావడంతో పాటు అదే సమయంలో కంటైనర్‌ వేగంగా ఉండడంతో ప్రమాదం తీవ్రత అధికంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ప్రస్తుతం పోలీసులు మృతులకు సంబంధించిన ఫోన్ల ద్వారా.. అందులో డయల్‌ చేసిన నంబర్ల ద్వారా మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.









Next Story