తెలంగాణ, ఏపీకి చెందిన ఆరుగురు ఫేక్‌ డాక్టర్లపై.. సీబీఐ కేసు నమోదు

Six fake doctors from Telangana, AP under CBI scanner. హైదరాబాద్: నకిలీ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎంజిఇ) పత్రాలను కలిగి ఉన్నారనే

By అంజి  Published on  30 Dec 2022 4:30 PM IST
తెలంగాణ, ఏపీకి చెందిన ఆరుగురు ఫేక్‌ డాక్టర్లపై.. సీబీఐ కేసు నమోదు

హైదరాబాద్: నకిలీ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎంజిఇ) పత్రాలను కలిగి ఉన్నారనే ఆరోపణలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ఆరుగురు వైద్యులు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) గుర్తించింది. 2011-2022 మధ్యకాలంలో ఉక్రెయిన్, చైనా, నేపాల్‌ల నుంచి వైద్యవిద్యను అభ్యసించిన 73 మంది వైద్య విద్యార్థులపై సీబీఐ విచారణ చేపట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరుగురు నకిలీ వైద్యులు గల్ఫ్‌ దేశాలు, కేరళ తదితర ప్రాంతాల్లో ప్రాక్టీస్‌ చేస్తున్నట్టు గుర్తించారు.

దర్యాప్తు సంస్థ నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఆరుగురు అభ్యర్థులు కాజీపేటకు చెందిన గుడిమళ్ల రాకేష్ కుమార్, చేవెళ్లకు చెందిన ఎస్ శ్రీనివాసరావు, వరంగల్‌కు చెందిన మహ్మద్ ఫసియుద్దీన్, లింగంపల్లికి చెందిన బి హరికృష్ణారెడ్డి, విజయవాడకు చెందిన మరుపిళ్ల శరత్ బాబు, ఏపీలోని విశాఖపట్నంకు చెందిన గొర్ల వెంకట రాజవంశీగా గుర్తించారు. నిందితుల నుంచి నేరారోపణ పత్రాలను కూడా సీబీఐ స్వాధీనం చేసుకుంది.

ఎఫ్‌ఎమ్‌జిఇలో ఉత్తీర్ణత సాధించకుండానే డజన్ల కొద్దీ విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లు రాష్ట్ర వైద్య మండలి (ఎస్‌ఎంసి) లేదా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ)లో తమను తాము ఎలా నమోదు చేసుకున్నారనే విషయాన్ని నిర్ధారించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏజెన్సీ విచారణను నిర్వహిస్తోంది. నేరపూరిత కుట్రకు ఐపిసి సెక్షన్లు 120 (బి)తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్, మోసం, ఫోర్జరీకి సంబంధించి 420 కింద కేసు నమోదైంది.

Next Story