దోపిడీ దొంగల బీభత్సం
రాజేంద్రనగర్‌లో దోపిడీకి పాల్పడిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat
రాజేంద్రనగర్‌లో దోపిడీకి పాల్పడిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు మొబైల్ ఫోన్లు, నగలు స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 21న రాజేంద్రనగర్‌లోని పి అండ్ టి కాలనీలో దొంగలు ఓ ఇంట్లో చొరబడి, దంపతులను కత్తితో బెదిరించి దోచుకున్నారు. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించగా నిందితులను పట్టేసుకున్నారు.
నిందితులను మైలార్‌దేవ్‌పల్లి నివాసి, డ్రైవర్ జిబ్రాన్ బిన్ జాబర్, కార్వాన్ నివాసి, ఫర్నిచర్ షాపు ఉద్యోగి మహ్మద్ అకీల్, హుమాయున్‌నగర్‌కు చెందిన వడ్రంగి మహ్మద్ ఫసియుద్దీన్, వట్టేపల్లికి చెందిన డ్రైవర్ సోహైల్ షా ఖాన్, మైలార్‌దేవ్‌పల్లి నివాసి మహ్మద్ అబ్దుల్ రబ్ జావీద్, కాలాపత్తర్‌కు చెందిన వంటమనిషి మహ్మద్ షబ్బీర్‌గా గుర్తించారు.
ఆ దంపతులు ఇంట్లో ఉన్నప్పుడు, నలుగురు నిందితులు తలుపు తట్టి బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డారు. నిందితులు అల్మారాను పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు, మొబైల్ ఫోన్లను దోచుకుని అక్కడి నుండి పారిపోయారు. బాధితులు రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విచారణలో దొంగలను పట్టుకున్నారు.