స్నేహితుడి వాట్సాప్ స్టేటస్ లో చెల్లెలి ఫోటో.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు

Sister's photo seen on WhatsApp status. మహారాష్ట్రలోని థానే లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన స్నేహితుడిని

By Medi Samrat  Published on  31 Dec 2021 6:35 PM IST
స్నేహితుడి వాట్సాప్ స్టేటస్ లో చెల్లెలి ఫోటో.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు

మహారాష్ట్రలోని థానే లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన స్నేహితుడిని కత్తితో పొడిచాడు. స్నేహితుడి వాట్సాప్ స్టేటస్‌లో తన సోదరి చిత్రాన్ని చూడడంతోనే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఉల్హాస్‌నగర్‌లోని హిల్‌లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ స్నేహితుడు ఫ్రెండ్ కడుపులో కత్తితో పొడిచాడు. రోహిత్ కంజానీ అనే వ్యక్తి విజయ్ రూపానీకి కూడా స్నేహితుడే..! ఆ వ్యక్తి విజయ్ చెల్లెలి ఫోటోను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

రోహిత్ కంజానీపై విజయ్ రూపానీ, పంకజ్ కుక్రేజా దాడి చేశారు. ఈ దాడిలో రోహిత్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. గాయపడిన రోహిత్ ను ఆసుపత్రిలో చేరాడు. అక్కడ అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తర్వాత నిందితులిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు 326, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేతాజీ చౌక్ ప్రాంతానికి నేరస్తులు విజయ్, పంకజ్ రాబోతున్నారని పోలీసులకు రహస్య సమాచారం అందడంతో పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఘటనకు ఉపయోగించిన కత్తి, ద్విచక్రవాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చంద్రకాంత్ ఠాక్రే ఈ ఘటనను విచారిస్తున్నారు.


Next Story