దేశంలో మహిళలు, చిన్నారులు, బాలికలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కఠిన చట్టాలు అమలవుతున్న కామాంధుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. మహిళ కనిపిస్తే చాలు.. ఎలాగైనా తమ కామవాంఛను తీర్చునేందుకు యత్నిస్తున్నారు. హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన జరిగింది. ఇద్దరు అక్కా చెల్లెళ్లపై ఓ దొంగ బాబా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణం నగరంలోని పాతబస్తీలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ ఇద్దరు యువతులు అనారోగ్యం పాలైన తమ తల్లిని కాపాడుకునే ప్రయత్నంలో పాతబస్తీలోని ఓ బాబాను కలిశారు. ఆ తర్వాత బాబా దగ్గర తల్లికి వైద్యం చేయిస్తూ వచ్చారు.
మంత్రాల పేరుతో తల్లికి వైద్యం చేస్తున్నట్లు నటించి.. ఇద్దరు యువతులపై బాబా కన్నేశాడు. ఇద్దరు అక్కాచెల్లెళ్లపై కామ వాంఛ పెంచుకున్నాడు. అక్కా చెల్లెళ్లపై పలు మార్లు అత్యాచారానికి తెగబడ్డాడు. ఇద్దరు యువతుల్లో ఒకరికి పెళ్లి అయ్యింది. పెళ్లైన యువతికి డైవర్స్ ఇప్పించి.. వారిపై అత్యాచారం చేశాడు. పెళ్లైన యువతిపై బాబా కొడుకు కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇద్దరు అక్కాచెల్లెళ్లను శారీరకంగా, మానసికంగా వేధించాడు. ఆ తర్వాత వారిని బాబా ఆర్థికంగా కుంగదీశాడు. బాధితురాళ్లు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాబా, బాబా కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.