స్క్రూడ్రైవర్‌తో డ‌బుల్ మ‌ర్డ‌ర్‌..!

తూర్పు ఢిల్లీలోని షకర్‌పూర్ ప్రాంతంలో బుధవారం ఉదయం డబుల్ మర్డర్ జరిగింది. స్క్రూడ్రైవర్‌తో 30 ఏళ్ల పాఠశాల ఉపాధ్యాయురాలిని, ఆమె 17 ఏళ్ల సోదరుడు హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు.

By Medi Samrat  Published on  18 April 2024 8:00 PM IST
స్క్రూడ్రైవర్‌తో డ‌బుల్ మ‌ర్డ‌ర్‌..!

తూర్పు ఢిల్లీలోని షకర్‌పూర్ ప్రాంతంలో బుధవారం ఉదయం డబుల్ మర్డర్ జరిగింది. స్క్రూడ్రైవర్‌తో 30 ఏళ్ల పాఠశాల ఉపాధ్యాయురాలిని, ఆమె 17 ఏళ్ల సోదరుడు హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. మృతులను షకర్‌పూర్‌కు చెందిన కమలేష్ హోల్కర్ (30), ఉత్తరప్రదేశ్‌లోని మధురలో నివాసం ఉంటున్న ఆమె తమ్ముడు రామ్ ప్రతాప్ సింగ్‌గా గుర్తించారు. ఉదయం 10:11 గంటలకు వీధిలో గొడవ జరిగిందని.. ఎవరో గాయపడ్డారని పోలీసులకు కాల్ వచ్చింది. వెంటనే ఒక బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జంట హత్యలు జరిగినట్లు గుర్తించారు. కమలేష్‌, ఆమె సోదరుడు మృతి చెందారని వైద్యులు ధృవీకరించారు.

"కమలేష్ యూపీలోని సాహిబాబాద్‌లో స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది. ఆమె సోదరుడు రామ్ ప్రతాప్ సింగ్ 12వ తరగతి చదువుతున్నాడు. ఏప్రిల్ 14న తన మేనల్లుడి పుట్టినరోజు సందర్భంగా తన సోదరి ఇంటికి వచ్చాడు. మృతురాలి కుటుంబానికి సమాచారం అందించాము" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తూర్పు) అపూర్వ గుప్తా తెలిపారు. కమలేష్, ఆమె భర్త శ్రీయాన్ష్ కుమార్ (33) మధ్య గొడవ జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ హత్యల తర్వాత అతను ఇంట్లో కనిపించకుండా పోయాడు. హత్యకు ఉపయోగించిన ఆయుధం స్క్రూడ్రైవర్ అని అనుమానిస్తున్నారు. తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

Next Story