ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో నిందితుడికి దూరపు బంధువైన వ్యక్తిపై థర్డ్‌డిగ్రీ టార్చర్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఒక పోలీసు అధికారి సస్పెన్షన్‌కు గురయ్యారు. నివేదికల ప్రకారం.. ముజఫర్‌నగర్‌లోని ఛపర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) R. రాణా.. గోహత్యకు సంబంధించిన కేసులో వాంటెడ్‌గా ఉన్న జిషాన్ అన్సారీ అనే నిందితుడిని అరెస్టు చేయడానికి ఒక బృందంతో ఖంపూర్ గ్రామానికి వెళ్లారు.
అక్కడ నిందితుడిని పట్టుకోలేదు ఆ బృందం. అదే గ్రామానికి చెందిన నిందితుడి దూరపు బంధువు ఫరద్ హకీమ్ (40)ని స్టేషన్‌కు తీసుకెళ్లారు.స్టేషన్‌లో హకీమ్‌ను ఎస్‌ఐ థర్డ్ డిగ్రీ టార్చర్‌కు గురిచేశాడు. అనంతరం గ్రామస్తుల ఒత్తిడి మేరకు పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేశారు. గ్రామస్థుల్లో ఒకరు హకీమ్ శరీరంపై గాయాల గుర్తులను చూపుతున్న వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో.. ఎస్‌ఎస్పీ వినీత్ జైస్వాల్ సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించారు.
ఎస్‌ఎస్పీ వినీత్ జైస్వాల్ మాట్లాడుతూ.. "విచారణలో సబ్-ఇన్‌స్పెక్టర్ దోషిగా తేలింది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అతడిని సస్పెండ్ చేశారు. అతనిపై శాఖాపరమైన విచారణ కూడా జరుగుతుందని అన్నారు.