వివాహితను లొంగదీసుకుని ఆమెతో అక్రమ సంబంధం నడుపుతున్న కీచక ఎస్ఐ బాగోతం బట్టబయలైంది. వివరాల్లోకి వెళ్తే... వనపర్తి రూరల్ ఎస్ఐ షేక్ షఫీ కొంతకాలంగా కొత్తకోటకు చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం నడుపుతున్నాడు. తరుచూ ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ.. భర్తలేని సమయంలో ఇంటికి వెళ్లి రాసలీలలు కొనసాగిస్తున్నాడు. అయితే.. ఆ నోట ఈ నోట విషయం తెలుసుకున్న భర్త ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని స్కెచ్ వేశాడు. ఈ క్రమంలోనే నవంబర్ 18న బయటకు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి ఇంటికి సమీపంలో కాపుకాశాడు.
భర్త బయటికి వెళ్లగానే ఆ మహిళ ఎస్‌ఐకి ఫోన్ చేయగా.. క్షణాల్లోనే ప్రియురాలి ఇంట ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరూ రాసలీలల్లో మునిగితేలుతుండగా.. భర్త స్నేహితుల సాయంతో వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. భార్య బరితెగింపును భరించలేకపోయిన ఆ భర్త.. భార్య, ఎస్ఐపై విరుచుకుపడ్డాడు. ఇద్దరిని ఇష్టం వచ్చినట్లు చావబాదాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఎస్ఐ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉండి నీచానికి దిగజారిన ఎస్ఐ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.