దారుణం.. భార్యను చంపి.. మృతదేహాన్ని ముక్కలు చేసి.. గుండెను గ్రామస్తులకు చూపిస్తూ..
పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురిలోని మేనాగురి ప్రాంతంలో ఒక భయానక సంఘటన జరిగింది.
By Medi Samrat
పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురిలోని మేనాగురి ప్రాంతంలో ఒక భయానక సంఘటన జరిగింది. ఇది జిల్లా మొత్తాన్ని కదిలించింది. ఆ ప్రాంతానికి చెందిన రమేష్ రాయ్ అనే వ్యక్తి తన భార్య దీపాలీ రాయ్‌ను హత్య చేయడమే కాకుండా ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి గుండెతో సహా పలు అవయవాలను సంచిలో పెట్టుకుని గ్రామంలో తిరుగుతున్నాడు.
నిందితుడు బ్యాగ్‌ని తెరిచి తన భార్య గుండెను కొందరికి చూపించాడని అక్కడ ఉన్నవారు చెప్పారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రజలు వెంటనే పంచాయతీకి సమాచారం అందించారు. పంచాయతీ చీఫ్ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహంలోని మిగిలిన భాగాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జల్‌పైగురి ప్రభుత్వ కళాశాల ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని.. అతడి కోసం గాలిస్తున్నామన్నామని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం భార్యను హత్య చేసిన తర్వాత రమేష్ రాయ్ పదునైన ఆయుధంతో ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత ముక్కలను బ్యాగ్‌లో వేసుకుని చుట్టు పక్కల తిరిగాడు. తానే స్వయంగా పలువురి వద్దకు వెళ్లి బ్యాగ్ తెరిచి గుండె, ఇతర శరీర భాగాలను చూపించాడని ఇరుగుపొరుగు వ్యక్తులు చెప్పారు.
ఘటన గురించి తెలియడంతో గ్రామంలోని ప్రజలు నిందితుడి ఇంటికి వెళ్లారు. అక్కడ మంచం పూర్తిగా రక్తంతో తడిసిపోయింది. ఆ తర్వాత పోలీసులను పిలిచారు. హత్యానంతరం నిందితుడు మృతదేహం ముక్కలను తీసుకుని ఆ ప్రాంతంలో సంచరిస్తున్నాడని మేనాగురి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సుబల్ చంద్ర ఘోష్ తెలిపారు. మా బృందం శరీర భాగాలను స్వాధీనం చేసుకుంది. నిందితుడి కోసం అన్వేషణ కొనసాగుతోందని తెలిపారు.
మేనాగురి గ్రామపంచాయతీ చీఫ్ నీలిమా రాయ్ మాట్లాడుతూ.. "ఒక వ్యక్తి బ్యాగ్‌లో శరీర భాగాలతో తిరుగుతున్నట్లు నాకు సమాచారం అందడంతో.. నేను వెంటనే పోలీసులకు సమాచారం అందించాను, ఇది చాలా భయానక దృశ్యం అని పేర్కొంది.