దారుణం..వీధుల్లో యువకుడిని వెంటాడి తుపాకీలతో కాల్చి చంపారు (video)
గ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్-1 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఘోరాయి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది
By - Knakam Karthik |
దారుణం..వీధుల్లో యువకుడిని వెంటాడి తుపాకీలతో కాల్చి చంపారు (video)
గ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్-1 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఘోరాయి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నితిన్ అనే యువకుడిని ముగ్గురు దుండగులు పక్కా ప్లాన్‌తో హతమార్చారు. నితిన్ తన ఇంటి సమీపంలో ఉండగా, ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా దాడికి దిగారు. నితిన్ తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, దుండగులు అతడిని వెంటాడి మరి అతి సమీపం నుంచి తుపాకీతో కాల్పులు జరిపారు. తీవ్ర రక్తస్రావం కావడంతో నితిన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రాథమిక విచారణ ప్రకారం, నితిన్‌కు మరియు నిందితులకు మధ్య గత కొంతకాలంగా పాత కక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ గొడవల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. నితిన్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. హత్య చేసిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నోయిడాలో యువకుడి దారుణ హత్యగ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్-1 పరిధిలో దారుణ ఘటన జరిగింది నితిన్ అనే యువకుడిని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఇంటి సమీపంలోనే ముగ్గురు వ్యక్తులు నితిన్‌ను వెంటాడి, అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.… pic.twitter.com/ZiLJQPBeDi
— ChotaNews App (@ChotaNewsApp) February 24, 2026