8 పెళ్లిళ్లు చేసుకుంది.. 9వ వివాహం చేసుకుంటూ ఉండగా..!

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.

By Medi Samrat
Published on : 1 Aug 2025 6:55 PM IST

8 పెళ్లిళ్లు చేసుకుంది.. 9వ వివాహం చేసుకుంటూ ఉండగా..!

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒకరి తర్వాత ఒకరు అలా ఎనిమిది మందిని వివాహం చేసుకుని, వారి నుండి లక్షల రూపాయలు వసూలు చేసిన నిత్య పెళ్లి కూతురిని పోలీసులు అరెస్టు చేశారు. సమీరా ఫాతిమాగా గుర్తించబడిన నిందితురాలు అరెస్టు చేసినప్పుడు ఆమె తొమ్మిదవ బాధితుడిని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసింది.

నిందితురాలు తన భర్తలను బ్లాక్‌మెయిల్ చేసి వారి నుండి డబ్బు వసూలు చేస్తోందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమీరా ఫాతిమా తన భర్తల నుండి డబ్బు వసూలు చేయడానికి ఒక ముఠాతో కలిసి పనిచేస్తోందని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితురాలు సమీరా చదువుకుంది, వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలిగా ఉంటూ ఈ పని చేస్తోంది.

గత 15 సంవత్సరాలుగా ఆమె అనేక మంది పురుషులను మోసం చేసిందని, ముఖ్యంగా ముస్లిం సమాజంలోని ధనవంతులైన, వివాహిత పురుషులను లక్ష్యంగా చేసుకుని మోసగించిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఆమె భర్తలలో ఒకరు నగదు, బ్యాంకు బదిలీల ద్వారా రూ. 50 లక్షలు, మరొకరి నుండి రూ. 15 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపించారు. సమీరా మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లు, ఫేస్‌బుక్‌ను ఉపయోగించి పలువురిని ముగ్గులో లాగేదని అధికారులు వెల్లడించారు.

Next Story