రాజస్థాన్ రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకుంది. నాగౌర్ జిల్లా దేగానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వివాహితపై 24 గంటల్లో రెండుసార్లు అత్యాచారం జరిగింది. ఇది ఓ సంచలనాత్మకమైన కేసు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత అందరూ షాకయ్యారు. జనవరి 26వ తేదీ సాయంత్రం బాధితురాలు మలవిసర్జన చేసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది.. ఆమె ఒంటరిగా ఉందని గుర్తించి వెనుక నుంచి వచ్చి ఓ వ్యక్తి పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె బట్టలు చింపేసి అత్యాచారం చేశారు. ఈ సమయంలో, ఆమె కేకలు వేయడంతో అత్తగారు సంఘటనా స్థలానికి పరిగెత్తుకుని వచ్చింది. నిందితుడు వారిద్దరినీ చంపేస్తానని బెదిరించి అక్కడి నుండి పారిపోయారు.
మరుసటి రోజు ఉదయం.. మహిళ తన ఇంట్లో వంట చేస్తుండగా, నిందితుడు ఆమె ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సమయంలో, ఆమె భర్త, అత్త రావడంతో నిందితుడు సంఘటన స్థలం నుండి పారిపోయాడు. బాధితురాలి కుటుంబం శుక్రవారం సాయంత్రం దేగాన పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. దేగాన సిఐ సుభాష్ చంద్ పునియా మాట్లాడుతూ.. "'లీలారామ్ కుమారుడు ఉమేష్ రామ్ బావ్రీ గత 10-15 రోజులుగా ఆమెను వేధిస్తున్నాడని, అవమానానికి భయపడి, ఆమె విడిచిపెట్టమని వేడుకుంది.. జనవరి 26 సాయంత్రం మరియు జనవరి 27 ఉదయం, రెండుసార్లు, లీలారామ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది" అని తెలిపాడు. భర్త, పిల్లలతో సహా మొత్తం కుటుంబాన్ని చంపేస్తానని నిందితుడు బెదిరించాడని బాధితురాలు తెలిపింది. పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు కూడా చేశారు.