మైనర్ బాలికపై అత్యాచారం.. 64 మంది అరెస్ట్
Sexual assault on minor girl .. 64 arrested. గుంటూరు జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన కేసులో ఇప్పటి వరకు 64 మందిని పోలీసులు అరెస్ట్
By అంజి Published on 16 Feb 2022 7:59 PM ISTగుంటూరు జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన కేసులో ఇప్పటి వరకు 64 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికను ఓ మహిళ తన వెంట తీసుకెళ్లి వ్యభిచార కుపంలోకి దింపిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. అయితే ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఇప్పటి వరకు 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు నగరంలో నివసిస్తున్న తల్లి, కూతురికి గత సంవత్సరం కరోనా మహమ్మారి సోకింది. ఆ తర్వాత వారు చికిత్స కోసం జీజీహెచ్‌లో చేరారు. చికిత్స పొందుతుండగానే బాలిక తల్లి చనిపోయింది. అదే సమయంలో బాలికకు స్వర్ణ కుమారి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. కరోనా మహమ్మారికి నాటు వైద్యం ఉందని చెప్పి, చికిత్స చేయిస్తానని బాలిక తండ్రి అనుమతి తీసుకుంది.
ఆ తర్వాత బాలికను తన వెంట తీసుకెళ్లింది. కొన్ని రోజుల తర్వాత బాలికను వ్యభిచారం చేయాలంటూ వేధింపులకు గురి చేసింది. ఆ తర్వాత బాలికతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని పలు వ్యభిచార గృహాల్లో వ్యభిచారం చేయించింది. 6 నెలలగా బాలిక చిత్రహింసలకు గురైంది. అప్పటికే బాలిక ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అక్కడి నుండి ఎలాగోలా తప్పించుకున్న బాలిక.. చివరికి తన తండ్రి దగ్గరికి చేరుకుంది. ఆ తర్వాత తన తండ్రి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మొదట స్వర్ణకుమారితో పాటు 23 మందిని అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ చేపట్టిన కోర్టు.. నిందితులందరినీ అరెస్ట్ చేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో పోలీసులు బాలికతో వ్యభిచారం చేసిన వారందరినీ గుర్తించి 64 మంది అరెస్ట్ చేశారు.