పొలంలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం.. గ్రామస్తుల ఒత్తిడితో బాధితురాలి కుటుంబం

Sexual assault on a five-year-old girl, same family had to leave village. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఐదేళ్ల అమాయక బాలికపై అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

By అంజి  Published on  24 Feb 2022 2:06 PM GMT
పొలంలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం.. గ్రామస్తుల ఒత్తిడితో బాధితురాలి కుటుంబం

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఐదేళ్ల అమాయక బాలికపై అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆశ్చర్యకరంగా ఈ సంఘటన తర్వాత.. గ్రామస్థుల ఒత్తిడితో బాధిత కుటుంబం గ్రామం వదిలి వెళ్ళవలసి వచ్చింది. సమాచారం ప్రకారం.. ఐదేళ్ల బాలిక పొలంలో మలవిసర్జన చేయడానికి వెళ్లినప్పుడు, ఒక వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. అత్యాచారం కేసు నమోదైన అనంతరం పోలీసులు అత్యాచార నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసు భరత్‌పూర్‌లోని చిక్సానా పోలీస్ స్టేషన్ ప్రాంతానికి సంబంధించినది. ఫిబ్రవరి 22 మధ్యాహ్నం పొరుగున ఉన్న ఒక యువకుడు పొలంలో 5 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు.

పొలంలో మల విసర్జన చేస్తున్న బాలికను మద్యం మత్తులో ఉన్న పక్కింటి యువకుడు పట్టుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని శిక్షించే బదులు, స్థానిక ప్రజలు బాధితురాలి కుటుంబ సభ్యులపై రాజీకి ఒత్తిడి చేయడం ప్రారంభించారు. దీని కారణంగా బాధిత కుటుంబం గ్రామం నుండి పారిపోవాల్సి వచ్చింది. అత్యాచార నిందితుడు వివాహితుడు. వృత్తిరీత్యా కూలీ. అతను బాధితురాలి పరిసరాల్లో నివసిస్తున్నాడు. ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు నమోదైనట్లు చిక్కానా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ గంగా సహాయ్ మీనా తెలిపారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story
Share it