కోడలిపై దారుణానికి పాల్ప‌డ్డ మామ‌

sexual abuse by uncle. మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాల‌ను అరిక‌ట్టేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్ని

By Medi Samrat  Published on  26 Feb 2021 11:49 AM IST
కోడలిపై దారుణానికి పాల్ప‌డ్డ మామ‌

మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాల‌ను అరిక‌ట్టేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తీసుకొచ్చిన దారుణాలు ఆగ‌డం లేదు. రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా హాబీబ్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కామంతో క‌ళ్లు మూసుకుపోయిన మామ.. కోడలిపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. వివ‌రాళ్లోకెళితే.. వ్యాపారం నిమిత్తం బ‌ట్ట‌ల ఖ‌రీదుకై మామ‌, కోడ‌లు గురువారం నాడు న‌గ‌రానికి వ‌చ్చారు. రాత్రి నాంపల్లిలోని ఓ హోటల్ లో రూమ్ అద్దెకు తీసుకున్నారు.

అర్ధరాత్రి స‌మ‌యంలో తన భర్త తండ్రి(మామ‌) తనపై అత్యాచారం చేశాడని హాబీబ్ నగర్ పోలీసులకు పిర్యాదు చేసింది బాధిత మ‌హిళ‌. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని హాబీబ్ నగర్ పోలీసులు తెలిపారు. హాబీబ్ నగర్ సీఐ పూసపాటి శివ చంద్ర మాట్లాడుతూ.. భరోసా సెంటర్‌కు స్టేట్ మెంట్ కు పంపించమని, స్టేట్ మెంట్ రాగానే అతడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Next Story