బయటేమో మసాజ్ సెంటర్.. బాలికలను బందీలుగా చేసి మత్తు మందు ఇచ్చి

Sex racket going on under guise of massage parlour busted in UP. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. బాలికలను, యువతులను బంధీలుగా ఉంచి బలవంతంగా

By అంజి  Published on  4 Feb 2022 11:01 AM GMT
బయటేమో మసాజ్ సెంటర్.. బాలికలను బందీలుగా చేసి మత్తు మందు ఇచ్చి

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. బాలికలను, యువతులను బంధీలుగా ఉంచి బలవంతంగా చిత్రహింసలకు గురిచేస్తున్న విషయం బయటకు వచ్చింది. అమ్మాయిలకు మత్తు మందు ఇచ్చి కస్టమర్లకు పంపించారు. ఈ ముఠా బారి నుంచి ఓ యువతి ఎలాగోలా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించి మొత్తం విషయాన్ని చెప్పింది. దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఎంతో మంది ఆడ పిల్లలు ఆ నరకం నుండి బయటపడ్డారు. లక్నోలోని గోమతి నగర్‌లో ఓ యువతి మసాజ్‌ పార్లర్‌లో పనిచేసింది. ఆరు నెలల క్రితం ఆమెకు ఫోన్ చేసి ఉద్యోగం కోసం పిలిచారు.

ఆమె అక్కడికి చేరుకోగానే ఓ ఇంట్లో బందీగా ఉంచారు. దేశం నలుమూలల నుంచి అమ్మాయిలను ఈ పార్లర్‌కు పిలిపించుకుని లైంగికంగా వేధిస్తూ ఉండేవారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు 6 మంది యువకులను అదుపులోకి తీసుకుని. 8 మంది బాలికలను రక్షించారు. నిందితులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముఠాలోని ఇతర సభ్యులను కూడా ఆరా తీస్తున్నామని, అనైతికంగా తమపై ఒత్తిడి తెచ్చి సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని ఓ యువతి ఫిర్యాదు చేసిందని ఈస్ట్ జోన్ డీసీపీ ఖాసీం అబ్ది తెలిపారు. చాలా మందిని అక్కడికక్కడే అరెస్టు చేశారు.

Next Story