ట్రాక్టర్‌-ట్రక్కు ఢీ.. ఏడుగురు భ‌క్తుల దుర్మ‌ర‌ణం.. ప్ర‌ధాని సంతాపం

Seven pilgrims killed in road accident in Pali.రాజ‌స్థాన్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ట్రాక్ట‌ర్‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Aug 2022 3:36 AM GMT
ట్రాక్టర్‌-ట్రక్కు ఢీ.. ఏడుగురు భ‌క్తుల దుర్మ‌ర‌ణం.. ప్ర‌ధాని సంతాపం

రాజ‌స్థాన్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ట్రాక్ట‌ర్‌ను ట్ర‌క్కు ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు దుర్మ‌ర‌ణం చెంద‌గా.. మ‌రో 20 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న పాలి జిల్లాలో చోటు చేసుకుంది.

సుమేర్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జి రామేశ్వర్ భాటి తెలిపిన వివ‌రాల మేర‌కు.. జైసల్మేర్‌లోని రామ్‌దేవ్రా ఆల‌యాన్ని ద‌ర్శించుకున్న కొంత‌మంది భ‌క్తులు ట్రాక్ట‌ర్‌లో తిరుగు ప్ర‌యాణం అయ్యారు. శుక్ర‌వారం రాత్రి పొద్దుపోయిన త‌రువాత వీరు ప్ర‌యాణిస్తున్న వాహ‌నాన్ని పాలి జిల్లాలోని సుమీర్‌పూర్‌లో ఓ ట్ర‌క్కు ఢీ కొట్టింది. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా.. 20 మందికి పైగా గాయ‌ప‌డ‌గా వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌రో వ్య‌క్తి మ‌ర‌ణించారు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు రామేశ్వర్ తెలిపారు.

మ‌రోవైపు ఈ ప్ర‌మాదంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌ర్‌, రాజ‌స్థాన్ సీఎం అశోక్‌ గెహ్లాట్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలిపారు.

Next Story