Breaking : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణి స్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు

By Medi Samrat  Published on  16 Oct 2024 5:24 PM IST
Breaking : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణి స్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని ఉసిరిక పల్లి గ్రామ శివారు ప్రాంతం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న‌ డ్రైవర్ కారు మితిమీరిన వేగంతో వెళుతుండ‌గా.. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న నీటి గుంతలో పడిపోయింది. దీంతో కారులో ఉన్న వారందరూ మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఉన్న‌వారిని వెలికి తీశారు.

ఈ ప్రమా దంలో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు, ఓ వ్యక్తి మృతి చెందారు. మృతులను పాము బండ తండాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో అత్యంత వేగంగా కారు నడిపి కల్వర్ట్‌ను ఢీ కొట్టి అదుపు తప్పి కాలువలో పడిపోపిన‌ట్లు స్థానికులు చెబుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించిన పోలీసులు.. మృతుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Next Story