ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లా ఇందిరాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని శక్తిఖండ్ 4లో నిర్మాణంలో ఉన్న భవనంలో సెక్యూరిటీ గార్డు సునీల్ రజత్ గురువారం ఉదయం తన భార్య రాను గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత తను కూడా మొదటి అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
దంపతులు మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో వాస్తవ్యులని ఏసీపీ ఇందిరాపురం అభిషేక్ శ్రీవాస్తవ తెలిపారు. శక్తిఖండ్ 4లో ఉన్న భవనంలో సునీల్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం భార్యతో గొడవ పడిన భర్త ఆమె గొంతుకోసి హత్య చేసినట్లు తెలిసింది. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏసీపీ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.