హైద్రాబాద్‌లో దారుణం.. బాలికపై స్కూల్ టీచర్ అత్యాచారయత్నం

School teacher held for rape attempt in Hyderabad. హైద్రాబాద్‌లోని ఛత్రినాక ప్రాంతంలో తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు

By Medi Samrat  Published on  7 Feb 2022 9:56 AM GMT
హైద్రాబాద్‌లో దారుణం.. బాలికపై స్కూల్ టీచర్ అత్యాచారయత్నం

హైద్రాబాద్‌లోని ఛత్రినాక ప్రాంతంలో తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు యత్నించినందుకు పాఠశాల ఉపాధ్యాయుడిని నగర పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. 4వ తరగతి చదువుతున్న బాలిక శనివారం ఉదయం 8 గంటలకు తన తరగతిలోని ఇతర పిల్లల కంటే ముందే పాఠశాలకు వచ్చింది. తరగతి గదిలో ఒంటరిగా ఉన్న బాలికను గ‌మ‌నించిన ఉపాధ్యాయుడు ఆమెపై దారుణానికి ఒడిగ‌ట్టేందుకు సిద్ద‌మ‌య్యాడు. బాలిక ప్ర‌తిఘ‌టించ‌డంతో తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పిన‌ట్ట‌య్యింది.

ఛత్రినాక ఇన్‌స్పెక్టర్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ.. తరగతి గదిలో ఒంటరిగా ఉన్న బాలికను గమనించి ఉపాధ్యాయుడు ఆమె బట్టలు తీసేందుకు ప్రయత్నించారని తెలిపారు. "అమ్మాయి కేక‌లు వేయ‌డంతో.. టీచ‌ర్‌ ఆమెను కొట్టాడు. అయితే.. కేకలు విన్న ఇతర పాఠశాల ఉపాధ్యాయులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలికను విడిచిపెట్టారని ఇన్స్పెక్టర్ చెప్పారు. పాఠశాల యాజమాన్యం బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ప‌లు సెక్ష‌న్‌ల కింద కేసులు న‌మోదు చేశారు పోలీసులు.


Next Story
Share it