బైక్‌ను ఢీకొట్టిన లారీ.. సర్పంచ్‌ మృతి

Sarpanch killed as lorry mows down bike in Adilabad. ఆదిలాబాద్‌లో బైక్‌ను లారీ ఢీకొనడంతో సర్పంచ్‌ మృతి చెందాడు.

By Medi Samrat
Published on : 15 May 2023 7:01 PM IST

బైక్‌ను ఢీకొట్టిన లారీ.. సర్పంచ్‌ మృతి

ఆదిలాబాద్‌లో బైక్‌ను లారీ ఢీకొనడంతో సర్పంచ్‌ మృతి చెందాడు. ఆదిలాబాద్ రూరల్ మండలం రాంపూర్ గ్రామం వద్ద సోమవారం ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో 60 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రాంపూర్ శివారులోని వక్రమార్గం వద్ద లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో తాంసి మండలం పొన్నారి గ్రామ సర్పంచ్ చింతలపల్లి సంజీవ్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆదిలాబాద్ రూరల్ సబ్ ఇన్‌స్పెక్టర్ నాగనాథ్ తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉండగా, తలమడుగు మండలం ఖోడాడ్ గ్రామం వద్ద ఆటో రిక్షాను లారీ ఢీకొనడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


Next Story