ఆరేళ్ల బాలికపై సర్పంచి భర్త లైంగిక దాడి

Sarpanch husband sexually assaults a six year old girl. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ఆరేళ్ల బాలికపై సర్పంచ భర్త అఘాయిత్యానికి

By అంజి  Published on  30 Oct 2021 7:33 AM GMT
ఆరేళ్ల బాలికపై సర్పంచి భర్త లైంగిక దాడి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ఆరేళ్ల బాలికపై సర్పంచ భర్త అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు దంపతులు, వారి కుమారుడు, కుమార్తె (6)తో కలిసి ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ సర్పంచ్‌ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. బాలిక తల్లి స్థానికంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తోంది. తండ్రి ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తూ రెండు రోజులకు ఒకసారి ఇంటికి వస్తూంటాడు. గురువారం రోజు బాలిక స్కూల్‌కు వెళ్లలేదు. దీంతో బాలికను సర్పంచి ఇంట్లో వదిలి తల్లి విధులకు వెళ్లింది. దీంతో ఇంట్లో ఎవరూ లేని టైమ్‌లో సర్పంచి భర్త.. బాలికకు చాక్లెట్ల ఆశచూపి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

సాయంత్రం తల్లి ఇంటికి వచ్చేసరికి.. బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. బాలికను ఆరా తీయగా తల్లికి జరిగిన దారుణాన్ని తెలిపింది. దీంతో తల్లి వెంటనే భర్తకు సమాచారం అందించింది. ఇద్దరూ కలిసి దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని నిలదీశారు. తప్పు అంగీకరించని సర్పించి భర్త.. వారిని ఇంట్లో బంధించి ఇంటికి లాక్‌ వేశాడు. విషయం తెలుసుకున్న బంధువులు ఘటనా స్థలికి చేరుకుని తాళం పగులకొట్టి దంపతులను బయటకు తీసుకొచ్చారు. అదే సమయంలో అక్కడి నుండి పరారు అయ్యేందుకు యత్నించిన నిందితుడి కారుపై దాడి చేశారు. ఆ తర్వాత పోలీసులకు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Next Story
Share it