ఇళ్ల ముందున్న చెప్పులు, బూట్లు వారి టార్గెట్‌.. ఎత్తుకెళ్లి ఎర్రగడ్డలో రూ.100, 200ల‌కు..

రామంతపూర్‌లో చెప్పుల దొంగ‌లు ఉప్పల్ పోలీసులకు చిక్కారు.

By Medi Samrat  Published on  12 Dec 2024 7:33 PM IST
ఇళ్ల ముందున్న చెప్పులు, బూట్లు వారి టార్గెట్‌.. ఎత్తుకెళ్లి ఎర్రగడ్డలో రూ.100, 200ల‌కు..

రామంతపూర్‌లో చెప్పుల దొంగ‌లు ఉప్పల్ పోలీసులకు చిక్కారు. వివ‌రాళ్లోకెళితే.. రామంతపూర్ వాసవీ నగర్‌లో మల్లేష్, రేణుక దంప‌తులు గత కొంత కాలంగా నివాసం ఉంటున్నారు. వీరిరువురు గత రెండు నెల‌లుగా సుమారు 100 ఇళ్ల‌లో దొంగతనం చేసి వెయ్యి జ‌త‌ల‌ బూట్లను ఎత్తుకెళ్లారు. ఈ వింత దొంగ త‌నంపై నాలుగు రోజులుగా కాలనీవాసులు నిఘా ఉంచి దొంగ‌ల‌ను ప‌ట్టుకున్నారు. పట్టుకున్న దొంగల విష‌య‌మై కాల‌నీ వాసులు ఉప్పల్ పోలీసులకు స‌మాచారం అందించారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి భార్యాభర్తలను విచారించగా.. భార్య మద్యం మత్తులో వచ్చి పోలీస్ స్టేషన్‌లో హల్చల్ చేసింది. ఇక‌.. ఎత్తుకెళ్లిన బూట్లను ఎర్రగడ్డలో రూ.100, 200ల‌కు అమ్ముకుంటున్నట్టు ఉప్పల్ పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఈ విష‌య‌మై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story