సైదాబాద్ కీచకుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరేళ్ల చిన్నారి చైత్రపై అత్యాచారానికి పాల్పడి.. అత్యంత దారుణంగా హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న రాజు చివరికిి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్ పై అతని డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. సైదాబాద్ సింగరేణి కాలనీ రేప్ కేస్ ఘటన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు పోలీసులు. ఘట్కేసర్- వరంగల్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహం పడి ఉన్నట్టు గమనించారు పోలీసులు. నగర నడిబొడ్డులోని సైదాబాద్- సింగరేణి కాలనీ నుంచి ఇతడు ఉప్పల్ తప్పించుకుని వెళ్లాడు.
సైదాబాద్ కేసు నిందితుడు రాజు డెడ్ బాడీ స్టేషన్ ఘన్‌పూర్ రైల్వే ట్రాక్‌పై పడి ఉందనే సమాచారంతో స్పాట్‌కి వెళ్లారు పోలీసులు. రాజు చేతిపై ఉన్న టాటూను చూసి ఆతనేనని కన్‌ఫామ్ చేసుకున్నారు. రాజును పట్టుకునేందుకు పోలీసులు వేర్వేరు బృందాలుగా గాలింపు ముమ్మరం చేశారు. బాధిత కుటుంబానికి తెలంగాణ హోంశాఖ మంత్రి మహమ్ముద్ అలీ, మంత్రి సత్యవతి రాథోడ్‌లు గురువారం రూ. 20 లక్షల చెక్కును ఇచ్చారు. అయితే, మంత్రులు ఇచ్చిన చెక్కును బాధిత కుటుంబం తిరస్కరించింది. 'మాకు చెక్ వద్దు.. ఆ దుర్మార్గుడిని ఉరితీయాలని' వేడుకున్నారు. మంత్రులు ఇచ్చిన చెక్కును మీడియా ముఖంగా తిరిగి ఇచ్చేస్తామని బాలిక తండ్రి తెలిపారు.