మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై విషం తినిపించి అడవిలో పడేశాడు..

Sahil raped a minor Dalit girl and throws her in forest. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో దళిత మైనర్‌పై అత్యాచారం చేసిన తర్వాత ఆమెకు విషం

By M.S.R  Published on  4 March 2022 6:45 AM GMT
మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై విషం తినిపించి అడవిలో పడేశాడు..

ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో దళిత మైనర్‌పై అత్యాచారం చేసిన తర్వాత ఆమెకు విషం ఇచ్చి అడవిలో పడేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మైనర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుడు సాహిల్‌ను అరెస్టు చేశారు. చనిపోయే ముందు బాధితురాలు జరిగిన దారుణం మొత్తాన్నీ చెప్పింది. వీడియో రికార్డింగ్‌ను పోలీసులకు అందించారు. మైనర్ బాలిక, నిందితుడు ఒకే గ్రామానికి చెందిన వారు. అత్యాచారాన్ని ప్రతిఘటించడంతో నిందితుడు మైనర్‌కు విషమిచ్చి అడవిలో పడేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మెడికల్ రిపోర్టు వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు.

ఈ ఘటన దేహత్ కొత్వాలి ప్రాంతానికి చెందినది. మృతురాలు బెహత్ రోడ్‌లోని టోప్రి గ్రామ నివాసి, తొమ్మిదో తరగతి చదువుతోంది. గురువారం (మార్చి 3, 2022) ఉదయం, ఆమె పరీక్ష రాయడానికి ఇంటి నుండి బయలుదేరింది. ఈ సమయంలో గ్రామానికి చెందిన నిందితుడు ఆమెను ప్రలోభపెట్టి తన వెంట తీసుకెళ్లాడు. ఆమెను ఓ హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేసి, విషం తినిపించి అడవిలో పడేశాడు. విద్యార్థి పరీక్షకు రాలేదని ఉపాధ్యాయులు ఫోన్ చేసి చెప్పారని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపినట్లు సమాచారం. ఆ తర్వాత కుటుంబ సభ్యులు బాలిక కోసం వెతకగా, ఆమె స్నేహితురాలి ద్వారా సాహిల్ గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు అతనికి ఫోన్ చేయగా.. బిజోపురి అడవిలో పడి ఉంది.. వెళ్లి ఆమెను తెచ్చుకోండి అని సాహిల్ చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు మైనర్ విద్యార్థిని కోసం వెతుకుతూ అడవికి చేరుకోగా.. ఆమె ఏడుస్తూ నోటి నుంచి నురగ వస్తూ కనిపించింది. ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ బాధితురాలిని రక్షించలేకపోయారు.

ఈ సంఘటన గురించి తెలియడంతో, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో జిల్లా ఆసుపత్రికి చేరుకుని నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించేందుకు కూడా గ్రామస్తులు అనుమతించలేదు. అనంతరం పోలీసులు వారికి వివరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇది లవ్ జిహాద్‌కు సంబంధించినదని భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ కేసును ఫాస్ట్రాక్ కోర్టులో విచారించాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సాహిల్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మెడికల్ రిపోర్టు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Next Story
Share it