యువతి మరణంతో అట్టుడికిన ఆ ప్రాంతం

Ruckus over death of girl in Agra. ఆగ్రాలోని షాహ్‌గంజ్ ప్రాంతంలోని చిల్లి పడా వీధిలో ఒక యువతి మృతిపై కలకలం రేపడంతో

By Medi Samrat  Published on  13 Nov 2021 3:26 PM IST
యువతి మరణంతో అట్టుడికిన ఆ ప్రాంతం

ఆగ్రాలోని షాహ్‌గంజ్ ప్రాంతంలోని చిల్లి పడా వీధిలో ఒక యువతి మృతిపై కలకలం రేపడంతో షాగంజ్ మార్కెట్‌లో విధ్వంసం చోటు చేసుకుంది. రెండు దుకాణాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడడమే కాకుండా.. ధ్వంసం చేసేసారు. దీంతో మార్కెట్‌లో భయం నెలకొంది. కొద్ది నిమిషాల వ్యవధిలోనే షాపుల షట్టర్లు కూలిపోయాయి. పోలీసులు వచ్చినా మార్కెట్‌ తెరుచుకోలేదు. గంటపాటు ఉత్కంఠ నెలకొంది. అసలు అంగళ్లు తెరవడానికి కూడా వ్యాపారులు భయపడ్డారు. అనంతరం సాయుధ బలగాలు రావడంతో వ్యాపారులు కొన్ని దుకాణాలను తెరిచారు.

షాహ్‌గంజ్ మార్కెట్‌కు అనుబంధంగా ఉన్న వీధిలోకి మొదట ఓ యువకుడు బయటకు వచ్చాడు. అతడితో పాటూ మరికొందరు కూడా వచ్చారు. కొన్ని దుకాణాలను టార్గెట్ చేశారు. ఆసిఫ్ బేగ్ మేనల్లుడు అమన్ తన రెడీమేడ్ బట్టల దుకాణంలో కూర్చున్న సమయంలో కొంతమంది యువకులు వచ్చారని పోలీసులకు చెప్పాడు. రాగానే విధ్వంసకాండ మొదలుపెట్టారు. సామాన్లు తీసేసి విసిరేశారు. లాకర్‌లో ఉంచిన 16 వేల రూపాయలు దోచుకెళ్లారు. హాజీ పప్పుకు చెందిన దుకాణంపై కూడా టార్గెట్ చేశారు. విధ్వంసం సృష్టించారు.

యువతి మృతితో తమకు ఎలాంటి సంబంధం లేదని వ్యాపారులు తెలిపారు. అయినప్పటికీ వారి దుకాణాలను టార్గెట్ చేశారు. వారి తప్పు ఏమిటి? ఫయీమ్ కార్ మెకానిక్ అని, అతని తండ్రి లోడింగ్ ఆటో నడుపుతున్నాడని స్థానికులు తెలిపారు. కుటుంబం 5 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఫయీమ్ భార్య మృతి చెందిన విషయం ఎవరికీ తెలియదు. వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారనే విషయం కూడా తెలియలేదు. పోలీసులు రావడంతో మృతి చెందినట్లు గుర్తించారు. దీంతో దుకాణాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. కొద్ది సేపటికే ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ విషయం పోలీసులకు కూడా తెలిసింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తిస్తున్నారు. ఫయీమ్ భార్య మృతిపై కూడా పలు విషయాలను తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు.


Next Story