Crime : పట్టపగలు బ్యాంకు దోపిడీ.. రూ.21 లక్షలు లూటీ

బీహార్ రాష్ట్రం పాట్నా దానాపూర్ దుల్హిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌పూర్ కొరయ్య గ్రామంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో బ్యాంకు దోపిడీ ఘటన వెలుగులోకి వచ్చింది

By Medi Samrat  Published on  5 Aug 2024 3:48 PM IST
Crime : పట్టపగలు బ్యాంకు దోపిడీ.. రూ.21 లక్షలు లూటీ

ప్ర‌తీకాత్మ‌క చిత్రం.. పట్టపగలు బ్యాంకు దోపిడీ.. రూ.21 లక్షలు లూటీ

బీహార్ రాష్ట్రం పాట్నా దానాపూర్ దుల్హిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌పూర్ కొరయ్య గ్రామంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో బ్యాంకు దోపిడీ ఘటన వెలుగులోకి వచ్చింది. బైక్‌పై మాస్కులు ధరించి వ‌చ్చిన‌ ఐదుగురు దొంగలు 21 లక్షలు దోచుకుని పరారైనట్లు సమాచారం. ఈ ఘటన ఉదయం 10.30 గంటల సమయంలో జరిగింది. దొంగ‌లు కస్టమర్లుగా నటిస్తూ వచ్చి బ్యాంకు తెరవగానే లోపలికి ప్రవేశించి.. అకస్మాత్తుగా ఆయుధాలు తీసి బ్యాంకు అధికారులను, ఖాతాదారులను బందీలుగా త‌మ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆపై అందరినీ బ్యాంకులో ఉన్న వంటగదిలో బంధించారు. అనంతరం బ్యాంకు లాకర్‌లోని సుమారు రూ.21 లక్షలతో పరారయ్యారు. నేరస్థులు నల్లటి అపాచీ బైక్‌ల‌పై వచ్చారు. ఈ ఘటన అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

దుల్హీన్ బజార్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోరీకి సంబంధించిన సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ముగ్గురు నలుగురు ముసుగులు ధరించిన దొంగలు 10-10.30 గంటలకు బ్యాంకు తెరవగానే ప్రవేశించి దొంగ‌త‌నానికి పాల్పడ్డారు. దోపిడీకి గురైన మొత్తం రూ.21 లక్షల వరకు ఉంటుందని మేనేజర్ తెలిపారు. నిందితులు డీవీఆర్‌ను తమ వెంట తీసుకెళ్లారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీల‌ని పరిశీలిస్తున్నామ‌ని.. కేసు న‌మోదు చేశామ‌ని తెలిపారు.

Next Story