రౌడీ షీటర్ బాబు ఖాన్ ను హత్య చేసి పరారైన నిందితుల అరెస్ట్

Rowdy sheeter Babu Khan murder. కొద్దిరోజుల కిందట రాజేంద్ర నగర్‌కు చెందిన 38 ఏళ్ల మునావర్ ఖాన్ అలియాస్ బాబూ ఖాన్

By Medi Samrat  Published on  26 Sept 2022 5:00 PM IST
రౌడీ షీటర్ బాబు ఖాన్ ను హత్య చేసి పరారైన నిందితుల అరెస్ట్

కొద్దిరోజుల కిందట రాజేంద్ర నగర్‌కు చెందిన 38 ఏళ్ల మునావర్ ఖాన్ అలియాస్ బాబూ ఖాన్ అనే రౌడీ షీటర్ అతని ప్రత్యర్థి వర్గం చేతిలో హతమైన సంగతి తెలిసిందే. హసన్ నగర్‌లో రౌడీషీటర్‌ తరలిస్తుండగా కొందరు దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో మునవర్ ఖాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. బహదూర్‌పురా పోలీసుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని.. ఫోరెన్సిక్ క్లూస్ బృందాన్ని కూడా రంగంలోకి దించారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు ఈ మర్డర్ మిస్టరీ వీడింది.

ఈనెల 14న బహదూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హత్య జరిగింది. పదునైన ఆయుధాలతో దుండగులు దాటి చేయడంతో బాబు ఖాన్ స్పాట్ లోనే మృతి చెందాడు. రౌడీ షీటర్ బాబు ఖాన్ ను హత్య చేసి పరారైన ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు బహదూర్ పుర పోలీసులు. నిందితుల వద్ద నుండి డాగర్స్ కత్తులు, ఓ పిస్తోల్ స్వాధీనం చేసుకున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ అరెస్టులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story