కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident Near Kondagattu. కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును.. లారీ ఢీకొట్ట‌డంతో

By Medi Samrat  Published on  15 Feb 2023 2:30 PM IST
కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును.. లారీ ఢీకొట్ట‌డంతో కండక్టర్‌ మృతి చెందగా, ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జగిత్యాల నుంచి వరంగల్ వెళుతున్న బస్సు ప్రమాదానికి గురికాగా.. బస్సులో 8 మంది ప్రయాణికులున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ రోజు సీఎం కేసీఆర్‌ కొండగట్టు పర్యటన ఉండగా కొద్ది దూరంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన కండక్టర్ కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లి కు చెందిన సత్తయ్య గా గుర్తించడం జరిగింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.


Next Story