ఏపీలో రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి

ఏపీలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు

By అంజి
Published on : 6 Jun 2023 2:00 AM

Road accident, Nandyala district, APnews, Crimenews

ఏపీలో రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి

ఏపీలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు చనిపోగా.. మరో ఇద్దరు కూతుర్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. కంపమల్ల - దొర్నిపాడు రోడ్డు మార్గంలో సోమవారం నాడు ఈ ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రి, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ఇద్దరిని ఆళ్లగడ్డ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద బాధితులను దొర్నిపాడు వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ప్రమాదానికి గల కారాణాలపై ఆరా తీశారు.

ఆ తర్వాత మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన బాధితుల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబీకులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మరో వైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిజామాబాద్‌ జిల్లాలోని నందిపేట్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. లక్కంపల్లి వద్ద సోమవారం రాత్రి ఆటో, కారు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరూ మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

Next Story