పండుగ‌పూట ఘోర రోడ్డు ప్ర‌మాదం.. వ‌రంగ‌ల్‌లో రెండు ఆర్టీసీ బ‌స్సులు ఢీ

Road accident in Warangal.పండుగ పూట వరంగల్ అర్బన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది,రెండు ఆర్టీసీ బ‌స్సులు ఢీ.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 13 Jan 2021 11:07 AM IST

Road accident in Warangal

పండుగ పూట వరంగల్ అర్బన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఎల్కతుర్తి మండలం వల్భాపుర్ గ్రామంలో జాతీయ రహదారిపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో 24 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వెంట‌నే వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వారిలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు.

ఓ బస్సు వరంగ‌ల్‌‌ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తుండగా.. మరో బస్సు నిజామాబాద్‌ నుంచి వరంగల్‌ వైపు వ‌స్తుంది. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉండాల్సి ఉంది. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగిందా..? లేక డ్రైవర్ వైఫల్యమా..? అనేది తేల్చేపనిలో అధికారులు పడిపోయారు.


Next Story