విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు పదో తరగతి విద్యార్థులు మృతి
Road accident in Vizag.విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పదో తరగతి విద్యార్థులు మృతి.
By తోట వంశీ కుమార్ Published on
21 March 2021 8:13 AM GMT

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పదో తరగతి విద్యార్థులు మృతి చెందారు. మాకవరపాలెం పీపీ అగ్రహారం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌తో చెట్టును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలంలోనే ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మృతి చెందారు. మృతులను మాకవరపాలెం చెందిన హేమంత్ (15), అనీశ్, హర్షిత్‌గా గుర్తించారు. ఈ ముగ్గురు పదో తరగతి చదువుతున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
బైక్‌పై వేగంగా వెళుతున్న ముగ్గురూ అదుపుతప్పి చెట్టుకు బలంగా ఢీ కొట్టారు. దీంతో హేమంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనీశ్ నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ లోను, హర్షిత్ విశాఖకు తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో తమ పిల్లలు మృతి చెందారని తెలిసి వారి కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అక్కడి వారిని కలిచివేసింది.
Next Story