వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. జేసీబీ మీద పడ‌టంతో..

ద‌ట్ట‌మైన పొగ మంచు కార‌ణంగా జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో వికారాబాద్ జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

By -  Medi Samrat
Published on : 2 Feb 2026 12:49 PM IST

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. జేసీబీ మీద పడ‌టంతో..

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

ద‌ట్ట‌మైన పొగ మంచు కార‌ణంగా జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో వికారాబాద్ జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వికారాబాద్ సమీపంలోని బుగ్గ రామేశ్వర ఆలయం మలుపులో రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో తండ్రి లాలయ్యతోపాటు కుమారుడు రిత్విక్ (8) మృతి చెందారు. పొగ మంచుతోపాటు ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు.

వికారాబాద్ నుండి బుగ్గ రామేశ్వరం వైపుగా ట్రక్కులో జేసీబీని తీసుకొని వెళుతుండగా.. టెంపుల్ మలుపులో అదుపుతప్పి ట్రక్ బోల్తా కొట్టింది. అటుగా వికారాబాద్ నుంచి బైక్‌పై వస్తున్న వారిపై ట్ర‌క్కుపై ఉన్న‌ జేసీబీ పడడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెంద‌గా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లాలయ్య ప్రాణాలు ఒదిలాడు. మరో స్కూటీపై వస్తున్న భార్య మేఘన, కూతురుకు స్వల్ప గాయాలు అయ్యాయి. సంఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story