విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి

Road Accident In Vijayanagaram. విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. సుంకరిపేట వ‌ద్ద‌ రెండు ఆర్టీసీ బస్సులను.. గ్యాస్ సిలిండ‌ర్ల‌ లోడ్‌తో వ‌స్తున్న లారీ ఢీకొన‌డంతో

By Medi Samrat
Published on : 29 March 2021 9:48 AM IST

Road Accident In Vijayanagaram

రోడ్డు ప్ర‌మాదాలు క‌ట్ట‌డి కావ‌డం లేదు. నిత్యం ఏదో మూల‌న ప్ర‌మాదాలు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా.. విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. సుంకరిపేట వ‌ద్ద‌ రెండు ఆర్టీసీ బస్సులను.. గ్యాస్ సిలిండ‌ర్ల‌ లోడ్‌తో వ‌స్తున్న లారీ ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు మృతి చెంద‌గా.. మరో ఇర‌వై ఐదు మందికి గాయాలయ్యాయి. సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను స్వాదీనం చేసుకున్నారు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ వారిని 108 సిబ్బంది సాయంతో ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

రోడ్డుపక్కన వేసిన మంటలతో దట్టంగా అలుముకున్న పొగ.. ప్ర‌‌మాదానికి కార‌ణంగా చెబుతున్నారు. డ్రైవర్లకు రోడ్డు కనిపించకపోవడంతోనే ప్రమాదం సంభ‌వించిన‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌మాద తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో.. బ‌స్సుల‌లో చిక్కుకుపోయిన వారికి వెలికి తీస్తున్నారు. ప్ర‌మాద స్థ‌లం.. ప్ర‌యాణికుల ఆర్త‌నాదాలతో ద‌య‌నీయంగా మారింది. ఘ‌ట‌న‌తో ఎన్‌హెచ్‌ 26పై కిలోమీటర్ల మేరక వాహనాలు నిలిచిపోయాయి. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.


Next Story