యూపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం : 8 మంది మృతి

Road Accident In Utter Pradesh. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కై ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్న

By Medi Samrat  Published on  2 Dec 2020 6:34 AM GMT
యూపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం : 8 మంది మృతి

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కై ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్న ప్ర‌మాదాల సంఖ్య మాత్రం త‌గ్గ‌డం లేదు. రోజురోజుకు రోడ్లు ర‌క్త‌పుమ‌డుగుల‌ను త‌ల‌పిస్తున్నాయి. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కౌశంబి జిల్లాలో బుధ‌వారం ఉద‌యం ఘోర రోడ్డుప్ర‌మాదం సంభ‌వించింది. ఇసుక లారీ - స్కార్పియో వాహ‌నం ఢీకొనడంతో.. ఈ ప్ర‌మాదంలో అక్క‌డిక‌క్క‌డే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో స్కార్పియో వాహ‌నంలో 10 మంది ప్ర‌యాణిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. వీరంతా వివాహ వేడుక‌కు హాజ‌రై తిరిగి వ‌స్తుండ‌గా ఈ ఘోరం జ‌రిగిందని వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌పై యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. గాయ‌ప‌డ్డ వారికి మెరుగైన చికిత్స అందించాల‌ని ఆదేశించారు. మృతుల కుటుంబాల‌ను ప్ర‌భుత్వం త‌రుపున ఆదుకుంటామ‌ని తెలిపారు.


Next Story