రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్ర‌మాదం.. న‌లుగురు దుర్మ‌ర‌ణం

Road accident in Tummanuru four dead.రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Feb 2023 8:00 AM IST
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్ర‌మాదం.. న‌లుగురు దుర్మ‌ర‌ణం

రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. డీసీఎం వాహ‌నాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు దుర్మ‌ర‌ణం చెందారు.

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా వెల్దండ మండ‌లానికి చెందిన కేశవులు(35), శ్రీనివాసులు(30), యాదయ్య(34), రామస్వామి(32) లు హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ శుభ‌కార్యంలో వంట చేసేందుకు వ‌చ్చారు. కార్య‌క్ర‌మం పూర్తి అయిన అనంత‌రం గురువారం రాత్రి స్వ‌గ్రామానికి బ‌య‌లు దేరారు. తుమ్మ‌నూరు వ‌ద్ద ప్ర‌మాదం జ‌రిగింది. స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story