శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై గత రాత్రి లారీని కారు ఢీకొనడంతో ఘోరప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో రైల్వే పోలీస్ విభాగంలో పనిచేస్తున్న సబ్-ఇన్‌స్పెక్టర్ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో పి. రాంవేందర్ గౌడ్ (31) శంషాబాద్ నుంచి తుక్కుగూడ వైపు ఔటర్ రింగ్ రోడ్డు మార్గంలో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. "కారు అధిక వేగంతో వచ్చి ముందున్న ట్రక్కును ఢీకొట్టింది. కారు నడుపుతున్న బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు' అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పహాడి షరీఫ్ పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.