పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ ట్రక్కును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. వినుకొండ మండల పరిధిలోని శివాపురం గ్రామ శివారులో బొప్పాయి కాయలతో వెళ్తున్న మినీ ట్రక్కును ఎదురుగా వచ్చిన లారీ అతివేగంతో బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మినీ ట్రక్కులో ఉన్న నలుగురు మహిళలకు తీవ్ర గాయాలు కాగా.. అందులో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మృతి చెందారు.
మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.మృతులంతా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లికి చెందిన వ్యవసాయ కూలీలు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.