నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్ర‌మాదం.. ముగ్గురు మృతి

Road accident in nellore dist.నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆటోను టిప్ప‌ర్ ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతి చెందారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 March 2021 8:36 AM IST
Road accident in Nellore dist

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆటోను టిప్ప‌ర్ ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు వద్ద మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. మోదుగుపాలేనికి చెందిన కూలీలు వెళ్తున్న ఆటోను మొదట టిప్పర్‌ ఢీకొట్టింది. ఆ ఆటో వెళ్లి ఓ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఆటోలో 8 మంది ఉన్నారు. ఈ ప్ర‌మాదంపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ‌


Next Story