ములుగు జిల్లాలో ఘోర ప్ర‌మాదం.. విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన ఆటో

Road Accident in Mulugu district two dead.ములుగు జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Feb 2023 12:18 PM IST
ములుగు జిల్లాలో ఘోర ప్ర‌మాదం.. విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన ఆటో

ములుగు జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఆటో అదుపు త‌ప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మ‌హిళ‌లు మ‌ర‌ణించారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

గోవింద‌రావుపేట మండ‌లం మ‌ద్దులగూడెం గ్రామానికి చెంది 17 మంది కూలీలు మేడారం స‌మీపంలోని మిర్చి తోట‌లో ఏరివేత ప‌ని కోసం ఆటోలో బ‌య‌లుదేరారు. తాడ్వాయి మండ‌లం నార్లాపూర్ గ్రామ స‌మీపంలోని పీహెచ్‌సీ మూల మ‌లుపు వ‌ద్ద ఆటో అదుపు త‌ప్పి ప‌క్క‌నే ఉన్న క‌రెంట్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో సునీత, బానోతు జ్యోతి లు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో న‌లుగురు ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. అతి వేగమే ప్ర‌మాదానికి కార‌ణం అని స్థానికులు అంటున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story