హైదరాబాద్ నగరంలో తండ్రీ కొడుకుల ప్రాణాలు తీసిన ఘోర రోడ్డు ప్రమాదం గురించి ప్రజలు మరచిపోకముందే.. మహబూబ్ నగర్ లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో - డీసీఎం వాహనం ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం మహబూబ్ నగర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలానగర్ లో జరిగే వారపు సంతకు ప్రజలు కూరగాయలతో పాటు ఇతర వస్తువులు కొనుగోలు చేసి ఆటోలో తిరిగి వెళ్తున్నారు. రోడ్డుపై ఆగిన ఆటోను డీసీఎం వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఆరుగురు మృతి చెందారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను బాలానగర్ మండల పరిధిలోని పలు తండాలకు చెందిన వాళ్లుగా గుర్తించారు.
శుక్రవారం సాయంత్రం సంత నుండి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను, ఓ బైక్‌ను డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ఆరుగురు ప్రయాణికులు అక్కడిక్కకడే మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుప్రతికి తరలించారు. మృతులంతా మండలంలోని మోతి ఘనాపూర్ గ్రామానికి చెందిన వారని తెలుస్తోంది.