కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Road accident in kurnool district. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు.. బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు.

By అంజి  Published on  19 Oct 2021 11:03 AM GMT
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు.. బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఆళ్లగడ్డ పట్టణ పరిధిలోని కాసింతల సమీపంలోని 40వ నేషనల్‌ హైవే వద్ద ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కర్నూలు నుంచి కడప వెళ్తుండగా... కారు టైరు పేలింది. దీంతో అదుపు తప్పిన కారులు డివైడర్‌ ఢీ కొట్టి పల్టీలు కొట్టుకుంటూ అవతలి వైపు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌ వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. మరోకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బైక్‌పై వెళ్తున్న ముగ్గురు భవన నిర్మాణ పనులను వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులు శిరివెళ్లికి చెందిన అప్జల్‌, కలాం, జావెద్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రాజేంద్ర పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it