ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Road accident in Kamareddy District six people dead.కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని
By తోట వంశీ కుమార్ Published on 18 Dec 2021 9:02 AM GMT
కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. పెద్దకొడపగల్ మండలం జగన్నాథపల్లి శివారులోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
క్వాలిస్ వాహనం.. బిచ్కుంద నుంచి పిట్లం వెలుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో వాహనంలో 12 మంది ఉన్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.