ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు మృతి

Road accident in Jaipur 6 dead.ఆగి ఉన్న లారీని వేగంగా వ‌చ్చిన ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు విద్యార్థుల‌తో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Sept 2021 10:06 AM IST
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు మృతి

ఆగి ఉన్న లారీని వేగంగా వ‌చ్చిన ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు విద్యార్థుల‌తో పాటు కారుడ్రైవ‌ర్ అక్క‌డిక‌క్క‌డే మృత్యువాత ప‌డ్డారు. ఈ దారుణ ఘ‌ట‌న శ‌నివారం తెల్ల‌వారుజామున రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్‌లో చోటు చేసుకుంది. మ‌రో ఐదుగురు విద్యార్థులు కూడా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. గాయ‌ప‌డిన విద్యార్థుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల వివ‌రాలు తెలియాల్సి ఉంది. కాగా.. విద్యార్థులంతా రీట్ ప్ర‌వేశ ప‌రీక్ష రాసేందుకు వెలుతున్న‌ట్లు స‌మాచారం.

Next Story