హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్ట్‌లు, డ్రైవర్‌ దుర్మరణం

Road accident in Gachibowli.. junior artists and car driver died . హైదరాబాద్‌ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది.

By అంజి  Published on  18 Dec 2021 2:25 AM GMT
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్ట్‌లు, డ్రైవర్‌ దుర్మరణం

  • గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి
  • అదుపుతప్పి డివైడర్‌ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొన్న కారు
  • ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు, కారు డ్రైవర్ మృతి

హైదరాబాద్‌ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ రోడ్డులో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్టులు, కారు డ్రైవర్‌ ఉన్నారు. కాగా మరో జూనియర్‌ ఆర్టిస్ట్‌ సిద్ధుకు ప్రమాదంలో తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులు మానస (22), మానస (21), డ్రైవర్‌ అబ్దుల్లగా స్థానికులు గుర్తించారు. అమీర్‌పేటలోని ఓ హస్టల్‌లో జూనియర్‌ ఆర్టిస్టులు ఉంటున్నారని తెలిసింది.

Next Story
Share it