రష్యాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ వృద్దాశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11 మంది వృద్దులు సజీవదహనమయ్యారు. నలుగురు ప్రాణాలతో భయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే.. అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది అనేది ఇప్పటి వరకు తెలియరాలేదు.
వివరాల్లోకి వెళితే.. బాష్‌కోర్టొస్టాన్ ప్రాంతంలోని ఉరల్ పర్వతశ్రేణుల్లో ఉన్న ఓ రిటైర్మెంట్ హోమ్‌లో మంగళవారం తెల్లవారు జూమున 3 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో అందరూ నిద్రలో ఉండడం.. వారంతా వృద్దులు కావడంతో.. వేగంగా స్పందించలేకపోయారు. దీంతో 11 మంది ఆ మంటల్లో కాలిబూడిదయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు అదుపులోకి రావడానికి సుమారు మూడు గంటల సమయం పట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. రిటైర్మెంట్ హౌజ్‌లో నలుగురు ప్రాణాలతో బయటపడినట్లు రష్యా ఏజెన్సీ ప్రకటించింది. ఈ ఘటన పట్ల విచారణ మొదలుపెట్టినట్లు రష్యా అధికారులు వెల్లడించారు.