చేతిలో ఎయిర్ రైఫిల్.. ఓపెన్ టాప్ జీప్.. హైదరాబాదీ అతి చూశారా.?

షోలే సినిమాలోని 'మెహబూబా మెహబూబా' అనే ఐకానిక్ పాట పెట్టి ఎయిర్ రైఫిల్, ఓపెన్ జీప్ లో తిరగడం ఏదైనా సినిమా సన్నివేశం అనుకోకండి.

By Medi Samrat
Published on : 29 March 2025 2:30 PM

చేతిలో ఎయిర్ రైఫిల్.. ఓపెన్ టాప్ జీప్.. హైదరాబాదీ అతి చూశారా.?

షోలే సినిమాలోని 'మెహబూబా మెహబూబా' అనే ఐకానిక్ పాట పెట్టి ఎయిర్ రైఫిల్, ఓపెన్ జీప్ లో తిరగడం ఏదైనా సినిమా సన్నివేశం అనుకోకండి. హైదరాబాద్‌లోని ఒక వ్యక్తి దానిని సోషల్ మీడియా రీల్ కోసం ప్రయత్నించాడు. అతడి రీల్స్ ను చూసిన వారిలో పోలీసులు కూడా ఉన్నారు. అతడిని పోలీసు స్టేషన్ కు పిలిపించి ఫోటో షూట్ పెట్టారు.

21 ఏళ్ల అఫీజుద్దీన్ అనే వ్యక్తి ఓపెన్ జీప్‌లో ప్రయాణిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్యాష్‌బోర్డ్‌పై ఎయిర్ రైఫిల్, బ్యాగ్రౌండ్ లో షోలేలోని 'మెహబూబా మెహబూబా' అనే ఐకానిక్ పాట ప్లే అవుతోంది. పోలీసులు అతడి మీద కేసు నమోదు చేశారు. ఈ వీడియోను హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లోని రోడ్ నంబర్ 1లోని సర్వి హోటల్ సమీపంలో చిత్రీకరించారు. పోలీసులు 21 ఏళ్ల వ్యక్తిని, జీపు డ్రైవర్‌ను అరెస్టు చేసి, రీల్‌లో కనిపించే ఎయిర్ గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వృత్తిరీత్యా వీడియోగ్రాఫర్, తరచుగా రీల్స్ తయారు చేయడానికి ఎయిర్ గన్‌ను ఉపయోగిస్తూ ఉంటాడని పోలీసులు తెలిపారు.

Next Story