కదులుతున్న రైలులో మహిళపై అత్యాచారం.. ప్రయాణికులు చూస్తుండగానే

Rape of a woman on a moving train. అగ్రరాజ్యం అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో ఓ క్రూరుడు అందరూ చూస్తుండగా

By అంజి  Published on  19 Oct 2021 8:42 AM GMT
కదులుతున్న రైలులో మహిళపై అత్యాచారం.. ప్రయాణికులు చూస్తుండగానే

అగ్రరాజ్యం అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో ఓ క్రూరుడు అందరూ చూస్తుండగా మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనను కాపాడాలని ఆ మహిళ ప్రాధేయపడిన.. ఒక్కరు కూడా ముందుకు రాలేదు. వివరాల్లోకి వెళ్తే.. మార్కెట్‌ - ఫ్రాంక్‌ఫోర్డ్‌ లైన్‌లో బాధితురాలు ప్రయాణం చేస్తుంది. అదే రైలులో నిందితుడు ఫిస్టన్‌ ఎన్‌గోయ్‌ కూడా ఎక్కాడు. అప్పటికే సమయం రాత్రి 10 అవుతోంది. రైలులో బాధితురాలితో పాటు ప్రయాణికులు కూడా ఉన్నారు. రైలులో బాధితురాలి పక్కనే కూర్చున్న ఎన్‌గోయ్‌.. ఆమెను అసభ్యకరంగా తాకుతూ వేధించడం మొదలు పెట్టాడు. దీంతో బాధిత మహిళ ప్రతిఘటించింది. అయినా కూడా ఎన్‌గోయ్ తీరు మార్చుకోలేదు. ఎన్‌గోయ్‌ చేస్తున్న అసభ్యకర పనులను రైలులో ఉన్న ప్రయాణికులు చూస్తున్నా.. ముందుకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో ఎన్‌గోయ్‌ మరింత రెచ్చిపోయాడు.

ప్రయాణికులు చూస్తుండగానే బాధితురాలిపై అత్యాచారం చేశాడు. తనను రక్షించాలని ఎంత ప్రాధేయపడినా.. అక్కడున్న వారెవరూ ముందుకు రాలేదు. రైల్వే ఉద్యోగులు సైతం బాధితురాలికి సాయం చేసేందుకు ముందుకు రాలేదు. తర్వాత స్టేషన్‌లో రైలు ఆగడంతో అందులోకి ఓ వ్యక్తి ఎక్కాడు. జరిగిన దారుణాన్ని గమనించిన అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఎన్‌గోయ్‌ని పోలీసులు అరెస్ట్‌ చేసి... బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చించారు. రైలులో మహిళ అత్యాచారం జరుగుతున్నా సమయంలో.. చాలా మంది ప్రయాణికులు అక్కడే ఉన్నారు. అందరూ కాస్త ధైర్యం చేసి ముందుకు వస్తే నిందితుడు భయపడి పారిపోయేవాడు, మహిళలకు ఇంత అన్యాయం జరిగేది కాదని ఓ పోలీసు అధికారి అన్నారు. ఈ ఘటన పట్ల మనందరం సిగ్గుపడాలని ఆవేదన వ్యక్తం చేశాడు.

Next Story
Share it