రంగారెడ్డి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Rangareddy Road accident .. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున

By సుభాష్  Published on  2 Dec 2020 8:37 AM IST
రంగారెడ్డి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున బోర్‌వెల్‌ వాహనాన్ని ఇన్నోవాకారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు హైదరాబాద్‌లోని తాడ్‌బండ్‌కు చెందిన వారుగా గుర్తించారు.

ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా మొత్తం ఆరుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృదేహాలు వాహనంలో ఇరుక్కుపోవడంతో సహాయక చర్యలు ఇబ్బందిగా మారింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story