షాద్‌నగర్‌లో దారుణం
Ranga Reddy Crime News. రంగారెడ్డి షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. మద్యం తాగొద్దని అన్నందుకు నిద్రలో భార్యకు కరెంట్ షాక్ పెట్టాడు ఓ తాగుబోతు.
By Medi Samrat Published on 17 May 2023 8:15 PM ISTరంగారెడ్డి షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. మద్యం తాగొద్దని అన్నందుకు నిద్రలో భార్యకు కరెంట్ షాక్ పెట్టాడు ఓ తాగుబోతు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పదేళ్ల కిందట వీళ్లద్దరికీ ప్రేమవివాహం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
పదేళ్ల క్రితం కవిత, యాదయ్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. యాదయ్య మద్యానికి బానిసగా మారాడు. మద్యం తాగవద్దని కవిత నిన్న రాత్రి భర్త యాదయ్యను కోరింది. ఈ విషయమై భార్యభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భార్య కవిత నిద్రపోయాక యాదయ్య భార్య కవితకు విద్యుత్ షాక్ పెట్టి చంపాడు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ లో గుర్తు తెలియని ఓ మహిళ తల కనిపించింది. తలను ప్లాస్టిక్ కవర్ లో పెట్టి మలక్ పేట్ మూసినది పరివాహక ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం కొందరు స్థానికులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు అక్కడికి వెళ్లారు. దీంతో వారికి ప్లాస్టిక్ కవర్ లో మొండం లేని మహిళ తల కనిపించింది. ఈ సీన్ చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన క్లూస్ టీమ్ సాయంతో అక్కడికి చేరుకున్నారు. ఎక్కడో హత్య చేసి ఆ తర్వాత ఆమె తలను ప్లాస్టిక్ కవర్ లో ఇక్కడ వదిలేసి వెళ్లిపోయారని భావిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.